For Money

Business News

శోభా డెవలపర్స్‌.. శభాష్‌

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో తమ కంపెనీ బాగా రాణించిందని బెంగుళూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ శోభా డెవలపర్స్‌ పేర్కొంది. మూడు నెలల, తొమ్మిది నెలలల్లో కంపెనీ పనితీరును వివరిస్తూ స్టాస్‌ ఎక్స్ఛేంజీలకు ఒక అప్‌డేట్‌ను కంపెనీ పంపింది. ఈ నివేదిక తరవాత కంపెనీ షేర్లు ఇవాళ ఎన్ఎస్ఈలో 4% పెరిగింది. ఈ మూడు నెలల్లో అమ్మకాల విలువ గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 18% పెరిగి రూ.1,048 కోట్లుగా ఉందని కంపెనీ పేర్కొంది. గత త్రైమాసికంతో పోలిస్తే అమ్మకాలు స్వల్పంగా 2 శాతం తగ్గినట్లు తెలిపింది. ప్రతి చదరపు అడుగు ప్రాతిపదికన సగటున కంపెనీ ఆదాయం 4% పెరిగినట్లు తెలిపింది. క్యూ3లో కంపెనీ మొత్తం అమ్మకాల్లో 72% బిజినెస్‌ బెంగళూరు నుంచే వచ్చింది. గురుగ్రామ్, పూణే, గిఫ్ట్ సిటీ కూడా ఈ త్రైమాసికంలో మంచి పనితీరును కనబరిచాయని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో సాధించాల్సిన అమ్మకాల టార్గెట్‌ను 9 నెలల్లోనే సాధించినట్లు కంపెనీ పేర్కొంది.