For Money

Business News

బంధన్‌ బ్యాంక్‌ ఢమాల్‌

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో బంధన బ్యాంక్‌ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ 10 శాతం నష్టంతో రూ. 238.55 వద్ద ముగిసింది. గత వారాంతంలో బ్యాంక్‌ ఫలితాలు ప్రకటించింది. రూ. 749 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ ప్రకటిస్తుందని మార్కెట్‌ అంచనా వేసింది.అయితే బ్యాంక్‌ ఏకంగా రూ. 209 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం కేవలం 13.3 శాతం పెరిగి రూ. 2193 కోట్లకు పెరగడం మార్కెట్‌కు అసంతృప్తి కల్గించింది. ఈ విషయంలో కూడా మార్కెట్‌ అంచనాలను అందుకోక పోవడంతో ఆరంభం నుంచి ఈ కౌంటర్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది.నికర వడ్డీ మార్జిన్‌ కూడా ఒక శాతం తగ్గింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో బ్యాంక్‌ రూ. 3954 కోట్లను ఎన్‌పీఏలుగా ప్రకటించింది.