For Money

Business News

ఎస్‌బీఐ డౌన్‌… పేటీఎం అప్‌

ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా…మన మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 17359ని తాకిన నిఫ్టి ఇపుడు 17456 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. పడినపుడల్లా నిఫ్టికి మద్దతు లభిస్తోంది. కార్పొరేట్‌ ఫలితాలకు ఆయా షేర్లు స్పందిస్తున్నాయి. అయితే నిరాశాజనక ఫలితాలు ప్రకటించిన ఎస్‌బీఐ, పేటీఎం షేర్లు భిన్నంగా స్పందించడం విశేషం. ఎస్‌బీఐ దాదాపు మూడు శాతంపైగా నష్టంతో రూ. 513ని తాకింది. అయితే నికర నష్టాలు మరింత పెరిగినా.. కంపెనీ టర్నోవర్‌ బాగా పెరగడం, భవిష్యత్‌పై కంపెనీ ఇచ్చిన గైడెన్స్‌ కారణంగా పేటీఎం షేర్‌ ఆరు శాతంపైగా పెరిగి రూ. 832ను తాకింది. ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయి నుంచి పేటీఎం షేర్‌ గట్టిగా కోలుకుంది. ప్రతికూల అంశాలన్నింటిని డిస్కౌంట్‌ చేయడంతో.. మున్ముందు కంపెనీ పనితీరు మెరుగ్గా ఉంటుందని చాలా మంది అనలిస్టులు కూడా అంచనా వేస్తున్నారు.