For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ – లెమన్‌ ట్రీ

బ్రేకౌట్‌ క్యాండిడేట్స్‌గా ఈ రెండు షేర్లను ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరానీ సిఫారసు చేశారు. రెండు వారాల క్రితం ఈ షేర్లను మన రిస్కీ బెట్స్‌లో పేర్కొన్నారు. ఇవాళ కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ను ఇతర అనలిస్టలు సిఫారసు చేశారు. ఇవాళ టాప్‌ కాల్స్‌లో ఈ షేర్‌ ఉంది. రూ. 1405-రూ.4015 ప్రాంతంలో బ్రేకౌట్‌ అయిన ఈ షేర్‌ తదుపరి టార్కెట్‌గా రూ.1500, ఆ తరవాత రూ. 1550గా పేర్కొంటున్నారు. ఇక నూరేష్‌ మేరాని సిఫారసు చేసే మరో షేర్‌ లెమన్‌ ట్రీ. నిజానికి ఈ షేర్‌ను చాలా మంది అనలిస్టులు సిఫారసు చేశారు. హోటల్‌ రంగానికి చెందిన ఈ షేర్‌ రూ. 60-రూ.65 మధ్య చాలా రోజులు కొనసాగింది. అద్భుతమైన పనితీరు కనబర్చడంతో ఈ షేర్‌ను రూ.100 టార్గెట్‌గా పేర్కొంటున్నారు. లెమన్‌ ట్రీ షేర్‌ను నూరేష్‌ పది రోజుల క్రితం రెకమెండ్‌ చేశారు. దాదాపు నాలుగు నెలల కన్సాలిడేషన్‌ తరవాత రూ.71.5 వద్ద బ్రేకౌట్‌ వస్తుందని నూరేష్‌ సిఫారసు చేశారు. అదే స్థాయిలో భారీ వ్యాల్యూమ్స్‌తో బ్రేకౌట్‌ ఛేదించిన లెమన్‌ ట్రీ షేర్‌ ఇవాళ రూ. 3.80 లాభంతో రూ. 76.70 ప్రాంతంలో ట్రేడవుతోంది. కనీసం మూడు మూడు ఏళ్ళ వరకు హోటల్‌ రంగంలో కొత్త కెపాసిటీ వచ్చే అవకాశం లేనందున ఈ రంగంలోని దాదాపు అన్ని షేర్లు భారీగా పెరుగుతున్నాయి. ఇండియ హోటల్స్‌ కూడా మార్చిలో రూ. 190ని తాకిన తరవాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. రూ. 220 – రూ. 240 కన్సాలిడేషన్‌ తరవాత వచ్చిన బ్రేకౌట్‌తో ఇపుడు రూ. 268 వద్ద ట్రేడవుతోంది.