For Money

Business News

నిఫ్టికి యూరో అండ

ఉదయం ఆరంభంలోనే నష్టాల్లోకి జారుకునిన 17359 పాయింట్లను తాకిన నిఫ్టి…అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. మిడ్‌ సెషన్‌ సమయానికి అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లోకి రావడమే గాక… యూరో మార్కెట్లు కూడా ఆకర్షణీయ లాభాతో ఓపెన్‌ కావడంతో నిఫ్టి మరింత బలపడింది. ప్రస్తుతం 17524 వద్ద 127 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా నిఫ్టి మిడ్‌ క్యాప్‌… నిఫ్టి బ్యాంక్‌ దిగువ స్థాయి నుంచి కోలుకున్నాయి. ఉదయం 0.6 శాతం నష్టాల్లో ఉన్న నిఫ్టి బ్యాంక్‌ ఇపుడు 0.81 శాతం లాభంతో ఉంది. కోల్‌ ఇండియా, బజాజ్‌ ఫిన్‌ సర్‌వ, ఎం అండ్‌ ఎం, హిందాల్కోతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌ నిలిచాయి. ఇక బీపీసీఎల్‌, ఎస్‌బీఐ నిఫ్టి లూజర్స్‌లో టాప్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌లో పేటీఎం టాప్‌ గెయినర్‌ కాగా, ఎస్‌బీఐ కార్డ్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది.