For Money

Business News

17500పైన ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల మధ్య మార్కెట్‌ 17500పైన ముగిసింది. దిగువ స్థాయి నుంచి నిఫ్టి దాదాపు 200 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే 127 పాయింట్ల లాభంతో 17525 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్‌ అర శాతం లాభం పడగా, మిగిలిన ప్రధాన సూచీలు 0.80 శాతం పైన ముగిశాయి. అంతర్జాతీ మార్కెట్లు ముఖ్యంగా యూరో మార్కెట్లు అర శాతంపైగా లాభంతో ఉండటం, అమెరికా ఫ్యూచర్స్‌ కూడా గ్రీన్‌లో ఉండటం కలిసొచ్చింది. ఇవాళ ఎం అండ్ ఎం అనూహ్యంగా పెరిగి నిఫ్టి టాప్‌ గెయినర్‌గా మారింది.ఈ షేర్‌ 3 శాతంపైగా లాభపడగా, కోల్‌ ఇండియా కూడా అదే స్థాయిలో లాభంతో ముగిసింది. బీపీసీఎల్‌ మూడు శాతం నష్టంతో క్లోజ్‌ కావడం విశేషం. ఎస్‌బీఐ రెండు శాతం నష్టపోయింది. పేటీఎం రికార్డుస్థాయిలో ఆరున్నర శాతం లాభంతో, సీమెన్స్‌ అయిదు శాతం వరకు లాభంతో ముగిశాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో హెచ్‌ఏఎల్‌ 7.85 శాతం లాభపడింది. హెచ్‌పీసీఎల్‌ 4.77 శాతం నష్టపోయింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తమ ధరలు పెంచకపోవడం వల్ల భారీగా నష్టపోతున్నట్లు వార్తలు రావడంతో… ఆ కౌంటర్లన్నీ భారీ నష్టాలతో ముగిశాయి. రిలయన్స్‌ మాత్రం రూ.33 లాభంతో ముగిసింది.