For Money

Business News

రూ. 2000 దాకా పెరిగిన వెండి

అంతర్జాతీయ మార్కెట్ బులియన్‌ గ్రీన్‌లో ఉన్నా… వెండి పరుగులు తీస్తోంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌ స్వల్పంగా క్షీణించింది. అలాగే పారిశ్రామిక వృద్ది జోరు ఏమాత్రం తగ్గలేదని… గత వారాంతంలో వెల్లడైన జాబ్‌ డేటా స్పష్టం చేయడంతో వెండికి డిమాండ్‌ వచ్చింది. అమెరికా మార్కెట్‌లో వెండి నాలుగు శాతం పెరగ్గా… రూపాయి పటిష్ఠంగా ఉండటంతో మన దేశంలో వెండి మూడున్నర శాతానికి పరిమితమైంది. అమెరికా మార్కెట్‌లో వెండి ధర 20.65 డాలర్లను దాటగా.. మన మనదేశంలో కూడా అదే జోరు కనబర్చింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో ఆగస్టు డెలివరీ కాంట్రాక్ట్‌ వెండి ధర రూ.59,249ని తాకింది. వెండి నిన్న రూ. 57364 వద్ద ముగిసింది.అంటే ఈ ఒక్కరోజే దాదాపు రూ.1900లకు పైగా పెరిగిందన్నమాట. బంగారం మాత్రం (ఆగస్టు కాంట్రాక్ట్‌) రూ. 402 లాభంతో రూ.52,276 వద్ద ముగిసింది.