For Money

Business News

ఉప్మా రవ్వ, గోధుమ పిండి, ఆటా ఎగుమతులపై నిషేధం

ఈనెల 14వ తేదీ నుంచి ఉప్మా రవ్వం (సూజి) గోధమ పిండి, ఆటా ఎగుమతులను భారత ప్రభుత్వం నిషేధించింది. గోధుమల ఎగుమతిని ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు కేవలం నోటిఫికేషన్‌ ముందు వీటి షిప్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఎగుమతులను అనుమతిస్తారు. అలాగే ఎగుమతులకు ఉద్దేశించిన వీటి కన్‌సైన్‌మెంట్‌ పత్రాలు ఇప్పటికే కస్టమ్స్‌అధికారులకు అప్పజెప్పి,ఆ శాఖ సిస్టమ్‌లో రిజిస్టరయి ఉంటే.. వాటి ఎగుమతులను కూడా అనుమతిస్తారు. అంటే నోటిఫికేషన్‌ వెలువడిన అంటే ఇవాళ్టి నుంచి కొత్త కన్‌సైన్‌మెంట్ల ఎగుమతికి అనుమతించరన్నమాట. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఈ ఏడాది గోధుమ పంట దిగుబడి తగ్గడంతో మే నెలలో గోధుమల ఎగమతిని భారత ప్రభుత్వం నిషేధించింది. ఇపుడు గోధమ పిండి, ఆటా, ఉప్మా రవ్వ ఎగుమతి కూడా నిషేధించింది.