For Money

Business News

హైదరాబాద్‌లో కొత్త ఒమైక్రాన్‌ వేరియంట్‌

ఒమైక్రాన్‌ సబ్‌ వేరియంట్స్‌ అయిన BA.4, BA.5లు ఆందోళ కల్గించే వేరియంట్స్‌ (Variants of Concern) అని వారం రోజుల క్రితం యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ECDPC) వెల్లడించింది. ఇందులో BA.4 వేరియంట్ హైదరాబాద్‌లో బయటపడింది. ఈ వేరియంట్‌కు సంబంధించి మన దేశంలో ఇదే మొదటి కేసు. కోవిడ్‌ 19 జెనొమిక్‌ సర్వెలెన్స్‌ ప్రొగ్రామ్‌ ద్వారా దీన్ని కనుగొన్నారు. దీనితో పాటు BA.5 అనే మరో ఒమైక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ఇపుడు దక్షిణాఫ్రికాలో కలకలం రేపుతున్నాయి. ఈ వేరియంట్‌తో అనేక కేసులు నమోదు అవుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌తో పాటు పలు దేశాల్లో ఈ వేరియంట్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఈనెల 9వ తేదీన హైదరాబాద్‌లో కనుగొన్న ఈ వేరియంట్‌ వైరస్‌కు సంబంధించిన సామాచారాన్ని GISAID వెబ్‌సైట్‌లో ఉంచారు. కొత్త వేరియంట్‌ వల్ల ప్రభావం తక్కువగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.