For Money

Business News

పామోలిన్‌ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వారాల క్రితం పామోలిన్‌ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. దేశీయంగా సరిపడా నిల్వలు జమ కావడంతో వచ్చే సోమవారం నుంచి పామోలిన్‌ ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు దేశాధ్యక్షుడు జొకొ విడొడొ వెల్లడించారు. దీంతో ఇండోనేషియా రైతులు, వ్యాపారస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిషేధం కారణంగా భారత్‌ వంటి పలు దేశాల్లో వంటనూనెల ధరలు తగ్గే అవకాశముంది. భారతీయులు వాడే అనేక వంటనూనెల్లో తక్కువ ధరకు అందించేందుకు పామోలిన్‌ కలుపుతారు. ఇండోనేషియా నిషేధం విధించడంతో భారత్‌లో పలు వంటనూనెల ధరలు పెరిగాయి. . తాజా నిర్ణయంతో భారత్‌లో కూడా వచ్చే వారం నుంచి వంటనూనెలు తగ్గే అవకావముంది.