For Money

Business News

పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు ఇప్పట్లో లేదు

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్ ధరలు గణనీయంగా క్షీణించాయి. ఒకదశలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర110 డాలర్లపైనే ఉంది. గత కొన్ని నెలలుగా ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల భారీగా క్షీణించి 82 డాలర్ల దాకా క్షీణించింది. దాదాపు 25 శాతం ధరలు తగ్గినా.. కేంద్రం మాత్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు వెంటనే ఉండదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. నిన్న రాత్రి ఓ సదస్సులో ఆమె మాట్లాడుతూ… గత కొన్నినెలలుగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ భారీగా నష్టాలతో పెట్రోల్‌, డీజిల్‌ అమ్ముతున్నాయని… అవి తమ నష్టాలు తగ్గించుకున్నాక… ధరలు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇప్పట్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గించమని ఆమె స్పష్టం చేశారు.