For Money

Business News

17100పైన నిఫ్టి ప్రారంభం

సింగపూర్ నిఫ్టితో పోలిస్తే రెట్టింపు లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,135ని తాకిన నిఫ్టి నిఫ్టి ఇపుడు 17084 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 68 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు ఇతర ప్రధాన సూచీలన్నీ దాదాపు అర శాతం లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో 46 షేర్లు లాభంతో ఉండగా కేవలం నాలుగు షేర్లు నష్టాల్లో ఉన్నాయి. నష్టాల్లో ఉన్న షేర్లు కూడా నామ మాత్రపు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ్టి స్టార్‌ షేర్ ఎస్‌బీఐ కార్ట్స్‌. రెండు శాతం లాభంతో ఈ షేర్‌ ట్రేడవుతోంది. బ్యాంక్‌ షేర్లలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రెండు శాతం లాభంతో ఉంది. నిన్న లిస్టయిన హర్షా ఇంజినీరింగ్‌ షేర్‌ ఇవాళ కూడా 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఆఫర్‌ ధరతో పోలిస్తే 45 శాతం లాభంతో నిన్న ఈ షేర్‌ ప్రారంభమైంది.