For Money

Business News

నిఫ్టి కొనాలా? అమ్మాలా?

మార్కెట్‌ తాత్కాలికంగా పెరుగుతుందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అన్నారు. ఇది కేవలం తాత్కాలికం మాత్రమేనని ఆయన చెప్పారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ… ఇవాళ నిఫ్టి కాల్‌ను కూడా కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. కొన్న ధరనే స్టాప్‌ లాస్‌గా పెట్టుకోవాలని అన్నారు. అయితే నిఫ్టిని అధిక స్థాయిలో అమ్మాలని మరో స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ నితీష్‌ ఠక్కర్‌ అన్నారు. అధిక స్థాయిలో నిఫ్టి నిలబడదని ఆయన అన్నారు. నిఫ్టికి 16900 ప్రాంతంలో మద్దతు లభించవచ్చని ఆయన అన్నారు. టెక్నికల్‌గా కూడా నిఫ్టికి 16900 స్థాయిలో మద్దతు ఉంది. ఈ స్థాయి దిగువకు వస్తే నిఫ్టి 16866 వద్ద నిఫ్టికి మద్దతు అందే అవకాశముంది. అయితే 16808 స్థాయిని కోల్పోతే మాత్రం భారీ నష్టాలు తప్పవు. అయితే ఇవాళ ఆ స్థాయికి పడే అవకాశవాలు లేవనే చెప్పాలి. (సుదర్శన్‌ సుఖనాఇ, నితీష్‌ మార్కెట్‌ రివ్యూ వీడియో కోసం వెబ్‌సైట్‌ దిగువ చూడగలరు.)