For Money

Business News

‘నీతి ఆయోగ్‌’ సమావేశం ప్రారంభం..

నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశం ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన వహించారు. మూడేళ్ళ తరవాత జరుగనున్న ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడం, పంటల మార్పిడి, జాతీయ నూతన విద్యావిధానం అమలు, పట్టణ పరిపాలన తదితర అంశాలు నేటి నీతి ఆయోగ్‌ సమావేశం ఎజెండాలో ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌లు మాత్రం ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. నీతి ఆయోగ్‌ అధికార పార్టీకి ఒక భజన మండలిగా మారిందని .. అందుకే ఈ సమావేశానికి హాజరు కావడం లేదని నిన్న కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ సోకడంతో నితీష్‌ హాజరుకాలేదు.