For Money

Business News

నిరాశ పర్చిన ఎస్‌బీఐ పనితీరు

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ. 8300 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని పలు బిజినెస్ ఛానల్స్‌ నిర్వహించిన సర్వేలో విశ్లేషకులు అంచనా వేశారు. అయితే అంచనాలకు భిన్నంగా ఈ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.6070 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం కూడా రూ.32500 కోట్లు ఉంటుందని అంచనా వేయగా, బ్యాంక్‌ రూ. 31196 కోట్లు ప్రకటించింది. నికర ఎన్‌పీఏ రూ.27965 కోట్ల నుంచి రూ. 28257 కోట్లకు పెరిగాయి.స్థూల ఎన్‌పీఏల మొత్తం రూ. 1.12 లక్షల కోట్ల నుంచి రూ. 1.13 లక్షల కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే జీఎన్‌పీఏ తగ్గి 3.97 శాతం నుంచి 3.91 శాతానికి తగ్గింది. అలాగే ప్రావిజన్స్‌ 39 శాతం తగ్గాయి. కాని రుణ నష్టాల ప్రొవిజన్‌ 31 శాతం పెరిగి రూ. 4270 కోట్లకు చేరింది. దీని ప్రభావం కారణంగా నికర లాభం తగ్గినట్లు తెలుస్తోంది.