For Money

Business News

17100 దిగువన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి కాస్త తక్కువ నష్టాలతో ప్రారంభమైంది. SGX NIFTY 275 పాయింట్లు క్షీణించగా, నిఫ్టి 200 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17090ని తాకిన నిఫ్టి ఇపుడు 17113 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుఓత పోలిస్తే 212 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 730 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టిలోని మొత్తం 50 షేర్లు నష్టాల్లోఉన్నాయి.ఒక్క షేర్‌ కూడా గ్రీన్‌లో లేదు. 3.75 శాతం నష్టంత టాటా మోటార్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. జేఎల్‌ఆర్‌ అమ్మకాలు తగ్గాయని వార్తలు రావడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. హీరో మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు కూడా 2 శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. నిఫ్టి ప్రస్తుత స్థాయిలో ఉంటుందా.. మిడ్‌ సెషన్‌ తరవాత మళ్ళీ క్షీణిస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే యూరో మార్కెట్‌ గత వారాంతాన పెద్దగా నష్టపోలేదు. ఆ నష్టాలు ఇవాళ కన్పిస్తాయేమో చూడాలి. అమెరికా ఫ్యూచర్స్ నష్టాల్లో ఉన్నందున మిడ్‌ సెషన్‌లో నిఫ్టి మరింత బలహీనపడుతుందా అన్నది చూడాలి.