For Money

Business News

పసిడీ వీక్‌…రూ.1400 తగ్గిన వెండి

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పతనం ప్రభావం మన మార్కెట్‌లో కూడా కన్పిస్తోంది. డాలర్‌తో రూపాయి విలువ క్షీణత కారణంగా మన మార్కెట్‌లో పతనం కాస్త తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం తన కీలక మద్దతు స్థాయి 1700 డాలర్లు కోల్పోగా, వెండి 20 డాలర్ల మద్దతు స్థాయిలను కోల్పోయింది. ఇపుడు బంగారం 1695 డాలర్ల వద్ద, వెండి 19.80 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. మన మార్కెట్ల విషయానికొస్తే… ఎంసీఎక్స్‌లో బంగారం రూ.550 తగ్గి రూ. 51,410 వద్ద ట్రేడవుతోంది. బంగారానికి రూ. 51300 వద్ద మద్దతు లభించే అవకాశముంది. ఇక కిలో విండో మన మార్కెట్‌లో రూ. 1400 తగ్గి రూ. 59400 వద్ద ట్రేడవుతోంది. వెండికి రూ. 59000 వద్ద మద్దతు లభించే అవకాశముంది. ఏదైనా అనూహ్య పరిణామం జరిగితే తప్ప బులియన్‌ మార్కెట్‌లో పెద్దగా మార్పులు ఉండవని బులియన్‌ మార్కెట్‌ అనలిస్టులు అంటున్నారు.