For Money

Business News

స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టితో పోలిస్తే నిఫ్టి కాస్త పటిష్ఠంగానే ప్రారంభమైంది. బ్యాంక్‌ నిఫ్టి నుంచి ఎలాంటి మద్దతు అందకున్నా… నిఫ్టి నిలకడగా ఉంది. ఆరంభంలో నష్టాల్లోకి జారుకుని 17,149కి చేరినా వెంటనే కోలుకుని ఇపుడు 17,232 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 38 షేర్లు లాభాల్లో ఉన్నా.. షేర్‌ ధరల్లో పెద్దగా మార్పు లేదు. మరి నిఫ్టి ఇవాళ ప్రతిఘటన స్థాయికి చేరి… అక్కడి నుంచి వెనక్కి తిరుగుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఇవాళ డెరివేటివ్స్‌ మార్కెట్‌లో వీక్లీ ముగింపు ఉంది. అలాగే మిడ్‌ సెషన్‌లో ప్రాంభమయ్యే యూరో మార్కెట్ల స్పందన కూడా చేయాలి. ఒమైక్రాన్‌ను కాదని గ్రీన్‌లో కొనసాగుతుందా.. లేదా అమెరికా మార్కెట్లకు స్పందిస్తుందా అన్నది చూడాలి. రాత్రి 1.5 శాతంపైగా నష్టపోయిన అమెరికా సూచీలు ఫ్యూచర్‌ మార్కెట్‌లో అర శాతం లాభంతో ఉన్నాయి. దీనికి యూరో మార్కెట్లు ఎలా స్పందిస్తాయనే దాన్ని బట్టి మన మార్కెట్లు క్లోజయ్యే అవకాశముంది. నిఫ్టి 17,250పైన అమ్మొద్దు, అలాగే కొనుగోలు చేయొద్దు. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు ఇదే స్థాయితో షార్ట్‌ చేయొచ్చు. కాని స్ట్రిక్ట్‌ స్టాప్‌లాస్‌తో చేయండి. యూరో మార్కెట్లు ప్రారంభమయ్యే లోపు… ఒక మోస్తరు లాభాలకు ఆస్కారం ఉంది.