For Money

Business News

నిఫ్టి: చివర్లో భారీ షార్ట్‌ కవరింగ్‌

ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నా… మన మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు ఉండటంతో షార్ట్‌ కవరింగ్‌తో నిఫ్టి 235 పాయింట్ల లాభంతో 17,401 పాయింట్ల వద్ద ముగిసింది. ఓపెనింగ్‌లో 17,149ని తాకిన నిఫ్టి రోజంతా గ్రీన్‌లో కొనసాగింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్ల నష్టాలు మన మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపాయి. ఇవాళ్టి కనిష్ఠ స్థాయితో పోలిస్తే నిఫ్టి 270 పాయింట్లు పెరిగింది. నిఫ్టిలో కేవలం మూడు షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్‌ సూచీ కూడా నిఫ్టికన్నా తక్కువ లాభంతో 1.2 శాతం లాభంతో ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి మాత్రం కేవలం .4 శాతం పెరగ్గా, నిఫ్టి నెక్ట్స్‌ 0.99 శాతం పెరిగాయి. సూచీలు కేవలం షార్ట్‌ కవరింగ్‌తోనే పెరిగాయని చెప్పడానికి మిడ్‌ క్యాప్‌ సూచీ కదలికలే కారణం. ఈ సూచీ మిడ్‌ సెషన్‌లో నష్టాల్లోకి జారుకుంది. అక్కడి నుంచి భారీగా కోలుకుంది. ముఖ్యంగా 2 గంటల నుంచి మిడ్ క్యాప్‌లో షార్ట్‌ కవరింగ్‌ భారీగా వచ్చింది.