For Money

Business News

NIFTY TRADE: దిగువ స్థాయలో మద్దతు కాని…

నిఫ్టి క్రితం ముగింపు 17,166. సింగపూర్‌ నిఫ్టి 40 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టికి ఇవాళ 17,120 ఈ స్థాయికి దిగువకు వెళితే నిఫ్టి వెంటనే 17,090కి చేరొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 17,023కి వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆసియా మార్కెట్లలో ఒమైక్రాన్‌ లేనందున సూచీలు కాస్త నిలదొక్కుకుంటున్నాయి. ఆసియా దేశాల్లో ఏమాత్రం కేసుల సంఖ్య పెరిగినా… ఇక్కడ ఒత్తిడి రావొచ్చు. కాబట్టి ఒమైక్రాన్‌ వార్తలను గమనించండి. ఆసియా బలంగా ఉన్నందున…నిఫ్టికి 17000పైన మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే మాత్రం 16,920 దాకా మద్దతు లేదు. కాని ఇవాళ ఆ స్థాయికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పైగా ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. కాబట్టి ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి. నిఫ్టికి గనుక 17,090 ప్రాంతంలో మద్దతు అందించే ఈజీగా క్రితం ముగింపు స్థాయికి నిఫ్టి చేరుతుంది. ఈ స్థాయిని కూడా దాటితే కచ్చితం 17200 స్థాయిని దాటుతుంది. తొలి ప్రతిఘటన మాత్రం 17,250 ప్రాంతంలో రావొచ్చు. సింపుల్‌గా నిఫ్టి 17,050 నుంచి 17,250 మధ్యకదలాడే అవకాశముంది. 17050 దిగువన కొనుగోలు చేయొద్దు. 17250పైన అమ్మకాలు చేయొద్దు.