For Money

Business News

16,500పైన నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి కన్నా అధిక లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16,565ని తాకిన నిఫ్టి ఇపుడు 16511 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 170 పాయింట్లు లాభపడింది. ఆయిల్ అండ్ గ్యాస్‌, మెటల్స్‌ షేర్లకు గట్టి మద్దతు లభించింది. ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. పెట్రోల్‌, డీజిల్‌,ఏటీఎఫ్‌ల ఎగుమతిపై సుంకం తగ్గించడమే దీనికి కారణం. నిన్న ఫలితాలు ప్రకటించిన హిందుస్థాన్‌ లీవర్‌లో లాభాల స్వీకరణ జరుగుతోంది. ఆ ఒక్క షేర్‌ మాత్రమే స్వల్ప నష్టంతో ఉంది. నిఫ్టిలో మిగిలిన 49 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. చిత్రంగా ట్రేడింగ్‌ మొత్తం నిఫ్టి ఆధారంగా సాగుతోంది. నిఫ్టి ఒక శాతంపైగా లాభపడగా… నిఫ్టి నిక్ట్స్‌ 0.6 శాతం, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 0.58 శాతం లాభంతో ఉన్నాయి. నిన్న ఒక శాతం లాభపడిన నిఫ్టి బ్యాంక్‌ ఇవాళ కూడా 0.83 శాతం లాభపడింది. ఐటీ షేర్లకు ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లకు గట్టి మద్దతు లభించింది. నిఫ్టి నెక్ట్స్‌ గెయిల్, సెయిల్, వేదాంత టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. బ్యాంక్‌ నిఫ్టిలో అన్ని షేర్లూ లాభాల్లో ఉన్నాయి.