For Money

Business News

అధిక స్థాయిలో అమ్మండి

నిఫ్టి ఇవాళ అధిక స్థాయిలో ప్రారంభమౌతుందని… గరిష్ఠ స్థాయిలో నిఫ్టిలో లాభాలు స్వీకరించడం ఉత్తమమని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు ట్రెండ్‌ అనుసరించి ట్రేడ్‌ చేయాలని సూచించారు. నిఫ్టి ఇవాళ గరిష్ఠ స్థాయికి చేరిన తరవాత స్వల్ప లాభాల స్వీకరణ ఉంటుందని అన్నారు. నిఫ్టి మున్ముందు కూడా పెరిగే ఛాన్స్‌ ఉందని.. అయితే ఎప్పటికపుడు పాక్షిక లాభాలు స్వీకరించడం ఉత్తమమని ఆయన సలహా ఇచ్చారు. ఇవాళ మళ్ళీ కొనుగోలు చేయొద్దని ఆయన అన్నారు.
రెకమెండేషన్స్‌
ఇంటలెక్ట్‌ డిజన్‌ ఏరియానా షేర్‌ను రూ. 662 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. అలాగే రూ. 30.50 స్టాప్‌లాస్‌తో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, రూ. 71 స్టాప్‌లాస్‌తో సెయిల్‌ కొనుగోలు చేయొచ్చని ఆయన ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. రామ్‌కో సిమెంట్‌ కూడా కొనొచ్చని అన్నారు.
మరో అనలిస్ట్‌ మితేష్‌ ఠక్కర్‌ సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ పలు షేర్లను రెకమెండ్‌ చేశారు.
రూ. 2975 స్టాప్‌లాస్‌తో రూ.3200 టార్గెట్‌తో మైండ్‌ ట్రీ షేర్‌ను కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. రూ. 110 స్టాప్‌లాస్‌తో రూ. 117 టార్గెట్‌తో పీఎఫ్‌సీని, రూ. 650 స్టాప్‌లాస్‌తో రూ. 690 టార్గెట్‌తో భారత్‌ ఫోర్జ్‌ కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు. జీఎన్‌ఎఫ్‌సీ టార్గెట్ రూ. 685తోకొనుగోలు చేయొచ్చని.. రూ. 640ని స్టాస్‌లాస్‌గా ఉంచుకోవాలని అన్నారు.