For Money

Business News

నిఫ్టి… సూపర్‌ రికవరీ

అధిక స్థాయిలో కాల్స్‌ అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు 17,200 ప్రాంతంలో కవర్‌ చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా ఆప్షన్స్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మడంతో పాటు … దిగువ స్థాయిలో ఇవాళ కొనుగోళ్ళు చేశారు. దీంతో ఇంట్రాడేలో నిఫ్టి 300 పాయింట్లకు పైగా పెరిగింది. ఇవాళ ఉదయం ఓపెనింగ్‌లో నిఫ్టి 17,216కి చేరింది. పైస్థాయిలో కాల్స్‌ అమ్మిన విదేశీ ఇన్వెస్టర్లు… 17200 వద్ద కాల్స్‌ను కవర్‌ చేసుకోవడమేగాక… పుట్స్‌ను భారీగా అమ్మారు. దీంతో కొన్ని నిమిషాల్లో నిఫ్టి 17,450కి చేరడం జరిగిపోయింది. ఇదంతా గంటలో పూర్తయింది. ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నా… మన మార్కెట్లు భారీగా పెరగడానికి కారణం… విదేశీ ఇన్వెస్టర్ల వ్యూహం తెలీక ఇరుక్కున్న అనేక మంది ఇన్వెస్టర్లు తమ షార్ట్‌ పొజిషన్స్‌ను రికవర్‌ చేసుకోవడానికి ప్రయత్నించడమే. మిడ్‌ సెషన్‌ తరవాత నిఫ్టి 17,553 పాయింట్ల స్థాయిని చేరింది. కరెక్ట్‌గా చెప్పాలంటే దాదాపు 350 పాయింట్లు రికవరైంది. క్లోజింగ్‌లో 17,503 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 87 పాయింట్లు పెరిగింది. నిఫ్టి 40 షేర్లు లాభాల్లోముగిశాయి. నిఫ్టికన్నా చాలా ఫాస్ట్‌గా రికవరైనా మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా 2 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా 1.5 శాతం లాభపడింది.