For Money

Business News

అధికారిక క్రిప్టో కరెన్సీకి ప్రభుత్వం ఓకే

ప్రస్తుత శీతాకాల సమావేశంలో ప్రభుత్వం మొత్తం 26 బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లు కూడా ఉంది. ద క్రిప్టో కరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్‌ 2021ను ప్రవేశ పెట్టనుంది.ఇటీవలే పార్లమెంటు స్థాయీ సంఘం క్రిప్టోకరెన్సీకి సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చింది. క్రిప్టో కరెన్సీని ఆపలేమని, అయితే నియంత్రించాల్సిన అవసరముందని పేర్కొంది. కొత్తగా ప్రవేశ పెట్టే బిల్లులో అధికారిక డిజిటల్‌ కరెన్సీ ఏర్పాటుకు తగిన ప్రణాళికలు తయారు చేసేందుకు వీలు కల్పించనుందని తెలుస్తోంది. దేశంలో ప్రైవేట్‌ క్రిప్టో కరెన్సీలను నిషేధించనుంది. అయితే క్రిప్టో కరెన్సీ, దానిని ఉపయోగించేందుకు అవసరమైన టెక్నాలజీని ప్రమోట్‌ చేసేందుకు కేంద్రం మినహాయింపులు ఇచ్చే అవకాశముంది.