For Money

Business News

దిగువన కోలుకున్నా…

ఉదయం ఆరంభంలోనే నిఫ్టి 17064 స్థాయిని తాకింది. అక్కడి నుంచి కోలుకుని మిడ్‌ సెషన్‌కల్లా 17280ని తాకింది. కాని యూరో మార్కెట్లు కూడా నష్టాలతో ప్రారంభం కావడంతో నిఫ్టి ప్రస్తుతం 17209 వద్ద ట్రేడవుతోంది. 104 పాయింట్లు నష్టంతో ఉంది. అమెరికా ఫ్యూచర్స్‌ దాదాపు ఒక శాతం నష్టంతో ఉన్నాయి. మరి యూరో మార్కెట్లు మాత్రం స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. దీంతో నిఫ్టి వెంటనే కూలకుండా… స్థిరంగా ట్రేడవుతోంది. మరి అమెరికా ఫ్యూచర్స్‌ మాదిరి యూరప్‌ కూడా పతనం అవుతుందా.. లేదా యూరో గ్రీన్‌లోకి వస్తుందా అన్న అనుమానం ఉంది.అమెరికా, చైనా మధ్య వాణిజ్య గొడవలు, ఉక్రెయిన్‌పై రష్యా తాజా దాడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్త ట్రేడ్‌ చేస్తున్నారు. నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టీలు కోలుకున్నా నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌లు నష్టాల్లోనే ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ ఏకంగా 1.28 శాతం నష్టంతో ఉంది. ఉదయం నుంచి టాటా మోటార్స్‌ నిఫ్టి టాప్‌ లూజర్‌గా ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ నిఫ్టి టాప్‌ గెయినర్‌ కాగా, ఇవాళ సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్న టీసీఎస్‌ 1.5 శాతం లాభంతో ఉంది.