For Money

Business News

తగ్గేదే లేదంటున్న నిఫ్టి

భారీ నష్టాల్లో ప్రారంభమైన నిఫ్టి… కాస్సేపటి క్రితం దాదాపు లాభాల్లోకి వచ్చింది. క్రితం ముగింపు 17655 కాగా, కొద్దిసేపటి క్రితం 17636ని తాకింది. ఇపుడు 28 పాయింట్ల నష్టంతో 17627పైన ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి కూడా కోలుకుని స్వల్ప నష్టంతో ఉంది. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు ఇప్పటికే గ్రీన్‌లోకి వచ్చేశాయి. ఇవాళ ఆటో షేర్లు దెబ్బతీయగా… సిమెంట్‌ షేర్లు అండగా నిలిచాయి. నిఫ్టిలో శ్రీ సిమెంట్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నిఫ్టి నెక్ట్స్‌లో అదానీ గ్రూప్‌ షేర్లయిన ఏసీసీ, అంబుజా షేర్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు భారీగా తగ్గడంతో ఆస్ట్రాల్‌ ఇవాళ కూడా మరో శాతం పెరిగింది. రియలన్స్‌ ఏ క్షణమైనా లాభాల్లోకి వచ్చేలా ఉంది. యూరో మార్కెట్లు అర శాతం వరకు నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే అమెరికా మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నాయి. ఫ్యూచర్స్‌ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి. వరుసగా ఏడు రోజుల నుంచి నష్టాల్లో ఉన్న నాస్‌డాక్‌ ఇవాళ గ్రీన్‌లో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇవాళ ఉదయం దిగువ స్థాయిలో కొనుగోలు చేసినవారికి మంచి లాభాలు అందాయి.