For Money

Business News

నిఫ్టి 470 పాయింట్ల రికవరీ!

రాత్రి అమెరికా మార్కెట్‌ స్థాయిలోనే మన మార్కెట్లు దిగువ స్థాయి నుంచి కోలుకున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ రెడ్‌లోఉన్నా… మన మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నాయి. ఉదయం భారీ నష్టాల్లో కూరుకుపోయిన నిఫ్టి కేవలం 40 నిమిషాల్లో గ్రీన్‌లోకి వచ్చేసింది. అక్కడి నుంచి హెచ్చుతగ్గులకు లోనవుతున్నా.. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యే సరికి మన మార్కెట్లు లాభాలతో పరుగులు తీశాయి. ఈలోగా అమెరికా ఫ్యూచర్స్‌ నష్టాలు కూడా తగ్గుముఖం పట్టాయి.మొత్తానికి కనిష్ఠస్థాయి నుంచి ఏకంగా 470 పాయింట్లు లాభపడింది నిఫ్టి. ఉదయం 16,836ని తాకగా, క్లోజింగ్‌కు ముందు 17,309 పాయింట్ల స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 128 పాయింట్ల లాభంతో 17,277 వద్ద ముగిసింది. ఇవాళ అత్యధికంగా బ్యాంక్‌ నిఫ్టి లాభపడింది. ఈ సూచీ 2 శాతంపైగా పెరిగింది. నిఫ్టి బ్యాంక్‌లో అన్ని షేర్లు లాభాలతో ముగిశాయి. తరవాత మిడ్‌ క్యాప్‌ సూచీ. ఈ సూచీ కూడా 1.34 శాతం లాభపడింది. షేర్ల విషయానికొస్తే నిఫ్టిలో మారుతీ, యాక్సిస్‌ బ్యాంక్‌ ముందున్నాయి. ఐటీ షేర్లు నష్టాల్లో ముందున్నాయి. ఇక మిడ్‌ క్యాప్‌లో జీ ఎంటర్‌టైన్మెంట్‌ 7 శాతం లాభపడింది. ఉదయం నష్టాల్లో ఉన్న ఈ షేర్‌ అనూహ్యంగా పెరిగింది.