For Money

Business News

మారుతీ లాభం ఓకే… షేర్‌ 7శాతం అప్‌

గత డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకీ కంపెనీ రూ. 1042 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంతో నికర లాభం రూ. 1997 కోట్లతో పోలిస్తే 48 శాతం తగ్గినా… రెండో త్రైమాసికంతో పోలిస్తే భారీగా పెరిగినట్లే. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 487 కోట్లు మాత్రమే.ఇక కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే మూడో త్రైమాసికంలో 1 శాతం తగ్గి రూ. 23,253 కోట్లకు చేరింది. కాని సెప్టెంబర్‌ త్రైమాసికంలోని రూ. 20551 కోట్ల ఆదాయంతో పోలిస్తే 15 శాతం దాకా పెరిగింది. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీ షేర్‌ 7 శాతం పెరిగి రూ.8614 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే చిప్‌ కొరతను ఎదుర్కొంటోందని, డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను డెలివరీ చేయలేకపోతున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే ముడి పదార్థాల వ్యయం భారీగా పెరిగిందని, దీంతో లాభాలపై ప్రభావం ఉంటోందని వెల్లడించింది.