For Money

Business News

రెసెడెన్షియల్‌ రియాల్టీలోనూ హైదరాబాద్‌ టాప్‌

దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రియల్టీలో ముఖ్యంగా రెసిడెన్షియల్‌ రియాల్టీలో హైదరాబాద్‌ దూసుకుపోతుందనని జెఎల్‌ఎల్‌ సంస్థ వెల్లడించింది. తాజాగా ఈ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. కొత్త వెంచర్లు ప్రారంభించే విషయంలో హైదరాబాద్‌ 26.1 శాతం వృద్ధితో నంబర్‌ వన్ స్థానంలో ఉందని ఈ సంస్థ పేర్కొంది. 17.6 శాతం వృద్ధి పుణె, 16.4 శాతం వృద్ధితో బెంగళూరు, 16.1 శాతం వృద్ధితో ముంబైత తరవాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇండియాలోని ఏడు ప్రధాన మెట్రో నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, కోలకతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, పూనే నగరాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా జేఎల్‌ఎల్‌ ఈ నివేదిక రూపొందించింది. 2021 క్యాలెండర్ ఇయర్‌లో అక్టోబరు నుంచి డిసెంబరు వరకు నాలుగో త్రైమాసికం పరిగణలోకి తీసుకుంటే ఏడు మెట్రోల్లో 45,383 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో 19 శాతం వాటాతో పుణె ప్రథమ స్థానంలో నిలిచింది. కాగా బెంగళూరు, హైదరాబాద్‌లు 17 శాతం వాటాతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 1.28 లక్షల కొత్త ఇళ్లు అమ్ముడయ్యాయని జేఎల్‌ఎల్‌ పేర్కొంది. ఇందులో హైదరాబాద్‌లో 15,787 ఇళ్లు అమ్ముడయ్యాయి. కరోనా రాక ముందు అంటే 2019లో హైదరాబాద్లో 15,804 ఇళ్లు సేల్‌ అయ్యాయి. అంటే ఇళ్ల అమ్మకాల విషయంలో కోవిడ్‌ పూర్వ స్థితికి హైదరాబాద్‌ చేరుకుందని జేఎల్‌ఎల్‌ వెల్లడించింది.