For Money

Business News

కీలక స్థాయిలో నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి అనుగుణంగా ఇవాళ నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17690ని తాకిన నిఫ్టి ఇపుడు 17685 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 80 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టిలో 44 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలు పరిమితంగా ఉన్నాయి. ఇతర ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి. అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఇవాళ నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టాటా స్టీల్‌, టాటా మోటార్స్‌ తరువాతి స్థానంలో ఉన్నాయి. నిన్న టాప్‌ గెయినర్‌గా ఉన్న అపోలో హాస్పిటల్‌ ఇవాళ నష్టాల్లో ఉంది. క్రూడ్‌ ధర భారీగా పెరగడంతో పెయింట్‌ కంపెనీలపై ఒత్తిడి వస్తోంది. ఎన్‌డీటీవీ ఇవాళ కూడా అప్పర్‌ సర్క్యూట్‌లో ఉంది. ఈ షేర్‌ రూ.407.60కు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ ధర వద్ద 5 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. ఇక నిఫ్టి నెక్ట్స్‌లో జూబ్లియంట్‌ ఫుడ్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐటీ షేర్లు ఇవాళ కాస్త కోలుకున్నాయి. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో కాస్త మద్దతు లభిస్తోంది. ఐటీ కన్నా.. బ్యాంక్‌ షేర్లు ఇపుడు మార్కెట్‌ ఫేవరేట్స్‌గా కొనసాగుతున్నాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే రెండో ప్రతిఘటన స్థాయిని దాటాయి. మరి ఇక్కడి నుంచి ఎక్కడి దాకా పెరుగుతాయే చూడాలి. ఇవాళ వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కాబట్టి.. తాజా పొజిషన్స్‌ తీసుకునేవారు స్టాప్‌లాస్‌ను పాటించండి.