For Money

Business News

డెరివేటివ్స్‌ ఎఫెక్ట్… చివర్లో నష్టాలు

వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ప్రభావంతో చివర్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో 17726 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి 17487 పాయింట్లకు క్షీణించింది. అంటే 250 పాయింట్ల వరకు పడింది. కాని చివర్లో స్వల్పంగా కోలుకుని 17522 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్లు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా… డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా నిఫ్టి క్షీణించింది. అమెరికా ఫ్యూచర్స్‌ అరశాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టితో పోలిస్తే ఇతర సూచీలు నామ మాత్రంగా క్షీణించాయి. నిఫ్టి నెక్ట్స్‌ గ్రీన్‌లో ముగిసింది. నిఫ్టిలో 16 షేర్లు లాభపడగా, 34 షేర్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టిలో శ్రీసిమెంట్స్‌, హిందాల్కో, దివీస్‌ ల్యాబ్‌ షేర్లు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. క్షీణించిన షేర్లలో అదానీ పోర్ట్స్‌ ముందుంది. నిఫ్టి నెక్ట్స్‌లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ టాప్ గెయినర్‌ కాగా, అదానీ ఎంటర్‌ప్రైజస్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. బ్యాంకు షేర్లలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 5 శాతం లాభపడింది. ఎన్‌డీటీవీ షేర్‌ ఇవాళ కూడా 5 శాతం లాభంతో రూ. 407.60 వద్ద క్లోజైంది.