For Money

Business News

LEVELS: పడితే కొనండి

మార్కెట్‌ దాదాపు 12 నెలల నిలకడగా ఉన్న తరవాత ఇపుడు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిని క్రాస్‌ చేసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో పెద్దగా పాజిటివ్‌ న్యూస్‌ లేదు. పైగా ఏడాది చివర్లో చాలా మంది ఇన్వెస్టర్లు, బ్రోకర్లు హాలిడే మూడ్‌లో ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అధిక స్థాయిలో నిఫ్టి ముందుకు సాగాలంటే కష్టమే. మరి ట్రేడర్ల కోసమే అన్నట్లు రోజూ నిఫ్టి వంద పాయింట్లు అటూ ఇటూ కదలుతూ ఉంటుంది. క్లోజింగ్‌ పద్ధతిలో చూస్తే పెద్ద మార్పు ఉండదు.కాని ఇంట్రా డేలో స్వల్ప లాభాలకు ఎపుడూ ఛాన్స్‌ ఉంటుంది. సరిగ్గా మార్కెట్‌ ఇపుడు అదే పరిస్థితి నెలకొంది. కాబట్టి నిఫ్టి పడినపుడు కొని… స్వల్ప లాభాలతో బయటపడటం రోజువారీ పనిగా మారింది. అధిక హెచ్చతగ్గులకు ఛాన్స్‌ ఉండదు. కాబట్టి నిఫ్టి 18550 లేదా 18500 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయాలని సీఎన్‌బీసీ ఆవాజ్‌ న్యూస్‌ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ సిఫారసు చేస్తున్నారు. ఈ స్థాయికి నిఫ్టి కొని… స్వల్ప లాభంతో బయటపడటం. నిఫ్టి 18720 పైన క్లోజైతేనే.. అధిక మార్పులకు ఛాన్స్‌ ఉందని.. అప్పటి వరకు బై ఆన్‌ డిప్స్‌ ఫార్ములాతో స్వల్ప లాభాలు తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఇంట్రా డే ఇన్వెస్టర్లు 18450ని స్టాప్‌లాస్‌గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిఫ్టి షార్టింగ్‌ మంచి వ్యూహం కాదని అంటున్నారు.