For Money

Business News

భాసిన్‌ బ్లాక్‌బస్టర్‌ బెట్స్‌

ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉన్న రెండు షేర్లను ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్ ఛైర్మన్‌ సంజీవ్‌ భాసిన్‌ రెకమెండ్‌ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈటీ నౌ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ ఈ షేర్లను సిఫారసు చేశారు. దీపావళి తరవాత సిమెంట్‌ రంగంలో యాక్టివిటీ పెరిగిందని… సిమెంట్‌ రంగం బాగా రాణిస్తుందని ఆయన అన్నారు. ఆయన ఇచ్చిన తొలి బెట దాల్మియా సిమెంట్‌. రూ.1725 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను కొనుగోలు చేయాలని.. ఈ వారాంతానికి ఈ షేర్‌ రూ. 1900కు చేరుతుందని ఆయన చెప్పారు. ఇక ఆయన రెకమెండ్‌ చేసిన మరో షేర్‌ గెయిల్‌. ప్రభుత్వ రంగ సంస్థల్లో గెయిల్‌ రీరేటింగ్‌ జరగలేదని..ఈ షేర్‌ బాగా పెరిగేందుకు ఆస్కారం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా గ్యాస్‌ పాలసీ కారణంగా ఈ కంపెనీ బాగా లాభపడే అవకాశముందని ఆయన అన్నారు. ప్రస్తుతం రూ. 94 ప్రాంతంలో ట్రేడవుతోందని… రూ. 90 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను రూ. 102 తరవాత రూ. 104 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని సంజీవ్‌ భాసిన్‌ సిఫారసు చేశారు.