For Money

Business News

18650పైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైంది. ఆరంభంలోనే నిఫ్టి 18666ని తాకింది. ఇపుడు 18665 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 47 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలో ఏకంగా 42 షేర్లు లాభాల్లో ఉన్నా.. సూచీల్లో పెద్దగా మార్పు లేదు. కారణంగా స్వల్ప లాభాలతో ఈ షేర్లు ట్రేడవుతుండటమే. నిఫ్టిలోఏడు షేర్లు నష్టాల్లో ఉన్నా… అవి కూడా నామ మాత్రమే. దాదాపు అన్ని ప్రధాన సూచీలు 0.40 శాతం లాభంతో ఉన్నాయి. భారీ బ్లాక్‌ డీల్‌ తరవాత కూడా జొమాటొ షేర్‌ 2.5 శాతం లాభంతో ట్రేడవుతోంది. నిన్న ఏడు శాతంపైగా పెరిగిన గ్లాండ్‌ ఫార్మా షేర్‌ ఇవాళ 2 శాతం దాకా నష్టంతో ట్రేడవుతోంది. ఆటోమొబైల్‌ షేర్లు ఇవాళ కాస్త వెలుగులో ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టిలో ఏయూ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌ షేర్లు ఒక శాతం లాభంతో ఉన్నాయి. నిన్న అయిదు శాతం లాభంతో క్లోజైన ఎన్‌డీటీవీ షేర్‌ ఇవాళ కూడా 5 శాతం లాభంతో ట్రేడవుతోంది.