For Money

Business News

NIFTY LEVELS: పడితే కొనండి

చైనాలో కరోనా కేసుల సంఖ్యభారీగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించడానికి ఇదే ప్రధాన కారణమని మార్కెట్‌ భావిస్తోంది. ఇదే నిజమైతే… మన మార్కెట్లకు ఇది పాజిటివ్‌ అంశమని మార్కెట్‌ విశ్లేషకులు అంటున్నారు. చైనా నుంచి పెట్టుబడులు భారత్‌కు వస్తాయని భావిస్తున్నారు. అయితే మన మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే చైనా మార్కెట్ల పతనం వల్ల క్రూడ్‌ధరలు తగ్గితే… మెటల్స్‌ ధరలు కూడా తగ్గుతాయి. ఇక ఇంట్రా డే ట్రేడింగ్‌ విషయానికి సవ్తే 18240 లేదా 18210 ప్రాంతంలో మంచి కొనుగోలు అవకాశం లభింవచ్చని సీఎన్‌బీసీ ఆవాజ్‌ మేనేజింగ్‌ ఎడిటర్‌ అనూజ్‌ సింఘాల్‌ అంటున్నారు. డే ట్రేడర్స్‌ 18150 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని అన్నారు. అలాగే పొజిషనల్‌ ట్రేడర్స్‌ 18050 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయొచ్చని అన్నారు. నిఫ్టికన్నా బ్యాంక్‌ నిఫ్టికాస్త పటిష్టంగా ఉండొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. గత వారం నిఫ్టి గరిష్ఠ, కనిష్ఠ స్థాయిల మధ్య వ్యత్యాసం కేవలం 200 పాయింట్లు మాత్రమే. అంటే డే ట్రేడర్స్‌కు అధిక లాభాలు అందడం లేదు. కాబట్టి డే ట్రేడర్స్‌కు కూడా స్వల్ప లాభాలు ఉన్నాయి.