For Money

Business News

అనుకున్నట్లే… అమ్మేస్తున్నారు

ఉదయం అనుకున్నట్లు నిఫ్టి 17000 ప్రాంతంలో అంటే 200 రోజుల చలన సగటు పైన నిలబడలేకపోయింది. ఆరంభంలో కొద్ది సేపు 17026 పాయింట్ల వద్ద ఉన్న నిఫ్టి మిడ్‌ సెషన్‌ కల్లా కరిగిపోతూ వచ్చింది. దీనికి కారణం యూరో ఫ్యూచర్స్‌ నష్టాల్లో ఉండటమే. మిడ్‌ సెషన్‌లో యూరో మార్కెట్లు ఒకశాతంపైగా నష్టంతో ప్రారంభమయ్యాయి. యూరోస్టాక్స్‌ 50 సూచీ ఒక శాతంపైగా నష్టపోయింది. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా ఒక శాతంపైగా నష్టపోవడంతో… ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారు. ఉదయం పది గంటలకే వీక్లీ, మంత్లీ కాంట్రాక్ట్‌లను చాలా మంది ఇన్వెస్టర్లు స్క్వేర్‌ ఆఫ్‌ చేసుకున్నారు. షార్ట్‌ కవరింగ్‌ కూడా ఉదయమే వచ్చేసింది. దీంతో నిఫ్టి క్రమంగా క్షీణిస్తూ వచ్చి 16804ని తాకింది. ప్రస్తుతం 16815 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 43 పాయింట్ల నష్టంతో నిఫ్టి ట్రేడవుతోంది. 88 డాలర్లకు చేరిన క్రూడ్‌ ఆయిల్ కూడా 2 శాతం క్షీణించింది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు అరశాతం దాకా నష్టపోయాయి. చూస్తుంటే ఇవాళ చివర్లో షార్ట్‌ కవరింగ్‌ అనుమానమే. మరి ఇతర మార్కెట్ల మాదిరి మన మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ముగుస్తాయేమో చూడాలి.