For Money

Business News

ఆర్ఈసీకి మహారత్న హోదా

రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) లిమిటెడ్‌కు కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా కల్పించింది.1969లో ఈ సంస్థను నెలకొల్పారు. విద్యుత్‌ రంగంలో ఫైనాన్స్‌, డెవలప్‌మెంట్‌ రంగంలో ఈ కంపెనీ పనిచేస్తోంది. ఈ హోదాతో కంపెనీ నిర్వహణలో బోర్డు మరిన్ని అధికారులు లభించాయి.ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోడంలో కంపెనీ బోర్డు అధిక అధికారాలు లభిస్తాయి. అలాగే ఫైనాన్స్‌ జాయింట్‌ వెంచర్లు, వంద శాతం అనుబంధ సంస్థలను ప్రారంభించడానికి.. వాటిలో ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఈసీ వీలవుతుంది. అలాగే దేశీయంగా విదేశాల్లో కూడా కొత్త కంపెనీలు టేకోవర్‌ చేయడం, విలీనం చేసుకోవడానికి వీలు ఉంటుంది. అయితే ఒక్కో ప్రాజెక్టులో రూ.15000 కోట్లు లేదా తన నెట్‌వర్త్‌లో 15 శాతం ఈక్విటీకి మించి పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు.