For Money

Business News

అయ్యో… లాభాలన్నీ పాయే…

ఉదయం నుంచి మంచి ఊపు మీద ఉన్న మార్కెట్ల సెంటిమెంట్‌ను యూరో మార్కెట్లు చావు దెబ్బ తీశాయి. దాదాపు 300 పాయింట్ల లాభం ఐస్‌ ముక్కలా కరిగిపోయింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఒక్క జపాన్‌ తప్ప… మిగిలిన చైనా, హాంగ్‌సెంగ్‌ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా నిఫ్టి దాదాపు రెండు శాతం దాకా పెరిగింది. కాని మార్కెట్లు ఓపెనింగ్‌లోనే భారీ నష్టాల్లో మొదలు కావడంతో మన మార్కెట్లు బలహీపడటం ప్రారంభమైంది. మరోవైపు అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లోకి జారుకోవడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏమాత్రం తగ్గకపోవడంతో నిఫ్టి క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. మిడ్‌సెషన్‌లో 17373 పాయింట్లను తాకిన నిఫ్టి అక్కడి నుంచి 17077 పాయింట్లకు క్షీణించింది. క్లోజింగ్‌లో కాస్త కోలుకుని 17101 వద్ద 8 పాయింట్ల నష్టంతో ముగిసింది. ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టి దెబ్బతీసింది. 0.77 శాతం నష్టంతో ముగిసింది. కాని మిడ్‌ క్యాప్‌ నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్‌ సూచీలు మాత్రం 0.8 శాతంపైగా లాభంతో ముగిశాయి. మారుతీ ఇవాళ మూడు శాతంపైగా నష్టపోయింది.