For Money

Business News

నిఫ్టి: అమ్మినవారికి కనకవర్షం

నాలుగు రోజుల నష్టాల తరవాత నిన్న లాభాల్లో ముగిసిన నిఫ్టి ఇవాళ మళ్ళీ నష్టాల్లో ముగిసింది. ఉదయం ఆసియా మార్కెట్ల భారీ నష్టాలను కాదని మిడ్ సెషన్‌ వరకు నిఫ్టి భారీ లాభాలతో ట్రేడైంది. ఒకదశలో 18,342 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. కాని యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభం కావడంతో మన మార్కెట్లు సరిగ్గా 2.15 గంటలకు పతనం కావడం ప్రారంభమైంది. ఒకదశలో 180 పాయింట్లకు పైగా క్షీణించిన నిఫ్టి చివర్లో స్వల్పంగా కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 57 పాయింట్ల నష్టంతో 18,210 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి 0.9 శాతం నష్టపోయింది. యాక్సిస్‌ బ్యాంక్‌ ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినా… ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. అలాగే బజాజ్‌ ఫైనాన్స్‌ ఫలితాలు కూడా మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా ఉన్నా…5 శాతం దాకా షేర్‌ నష్టపోయింది. నిఫ్టి మరో సారి ఆల్గో ట్రేడింగ్‌కు అనుగుణంగా కదలాడింది.