For Money

Business News

భారీ నష్టాల్లో నిఫ్టి

ఉదయం ఆరంభంలో లాభాల్లో ఉన్న ఆసియా మార్కెట్లు క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సింగపూర్ నిఫ్టి లాభాలు కూడా కరిగిపోయాయి. సో… నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16,838కి చేరింది.ఓపెనింగ్‌లో 17068ని తాకిన నిఫ్టి కేవలం మూడు నిమిషాల్లో నిఫ్టి 220 పాయింట్లు క్షీణించి 16,838ని తాకింది. ఇపుడు 171 పాయింట్ల నష్టంతో 16,854 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. ఇది నిఫ్టికి తొలి మద్దతు స్థాయి. 16,800 స్టాప్‌ లాస్‌తో కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. 16,800ని కోల్పోతే మాత్రం నిఫ్టి 16,700 దాకా మద్దతు లేదు. నిఫ్టిలో 46 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. కేవలం నాలుగు షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్‌లో భారీ నష్టపోయింది మిడ్‌ క్యాప్‌ నిఫ్టి. ఈ సూచీ ప్రస్తుతం 2.8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్ కూడా 2 శాతంపైగా నష్టపోయింది.