For Money

Business News

NIFTY TRADE: అమ్మండి కానీ…

మార్కెట్‌ ఇవాళ స్వల్ప లాభంతో ప్రారంభం కానుంది. సింగపూర్ నిఫ్టి 93 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి క్రితం ముగింపు 17,026. ఈ లెక్కన నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17100పైన ప్రారంభం కానుంది. నిఫ్టి 17,087పైన ఉంటే ఈజీగా 17,175ని చేరే అవకాశముంది. నిఫ్టి 17,200 ప్రాంతానికి చేరితే అమ్మకాల ఒత్తిడి రావొచ్చు. నిఫ్టి ఇప్పటికే ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరిపినందున… షార్ట్‌ కవరింగ్‌ వస్తుందని టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇదంతా మిడ్‌ సెషన్‌ వరకే. ఎందుకంటే ఒమైక్రాన్‌ యూరప్‌లో విస్తరిస్తోంది. అనేక దేశాల్లో ఈ వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. అమెరికా మార్కెట్ల ఫ్యూచర్స్ ఒక శాతం వరకు లాభంతో ఉన్నాయి. మరి ఇవి మిడ్‌సెషన్‌ తరవాత కూడా కొనసాగుతాయా అన్నది చూడండి. నిఫ్టిని అమ్మాలనుకునేవారు మిడ్‌ సెషన్‌పై ఎక్కువ శ్రద్ధ చూపండి. నిఫ్టి పడితే ఇదే లెవల్స్‌ను చూడండి. నిఫ్టికి మద్దతు మాత్రం 16,850 వద్ద మాత్రమే ఉంది. కాబట్టి కొనుగోలుకు దూరంగా ఉండండి. ఆసియా మార్కెట్ల పరిస్థితి చూస్తుంటే నిఫ్టికి భారీ లాభాలు కష్టమే అనిపిస్తోంది.