For Money

Business News

18,000పైన నిలబడలేకపోయిన నిఫ్టి

ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి 18,000పైన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. ఉయదం ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే నిఫ్టి 18,012ని తాకింది.ఇదే ఇవాళ్టి గరిష్ఠస్థాయి. అక్కడి నుంచి నిఫ్టి పడుతూ లేస్తూ వచ్చింది. సరిగ్గా రెండు గంటల సమయంలో నిఫ్టి నేరుగా 178,47కు పడింది. అంటే 160 పాయింట్లు పడింద్నమాట. తరవాత కూడా ఊగిసలాడి క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్ల నష్టంతో 17,888 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి మద్దతు లభించినా.. మెటల్స్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టి 30 షేర్లు నష్టాల్లో ముగిశాయి. కాని నిఫ్టి మిడ్‌ క్యాప్‌ దాదాపు ఒక శాతం లాభంతో ముగిసింది. ఆరంభంలో కనిపించిన టాటా మోటార్స్‌ లాభాలు క్రమంగా కరిగిపోయాయి. కానీ మారుతీ సుజుకీ రెండు శాతంపైగా లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది.