For Money

Business News

గరిష్ఠ స్థాయి వద్ద నిఫ్టి

నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందింది. దీంతో కోలుకున్న నిఫ్టి తొలి ప్రతిఘటన స్థాయి 17300 ప్రాంతంలో కదలాడుతోంది. అమెరికా ఫ్యూచర్స్‌ ఒక శాతంపైగా లాభంతో ఉన్నా… యూరో మార్కెట్లలో ఆ ఉత్సాహం కొరవడింది. దీంతో మార్కెట్‌ ఊగిసలాటలో ఉంది. మార్కెట్‌ కూడా పూర్తిగా బ్యాంక్‌ షేర్లపై ఆధారపడింది. ఉదయం నష్టాల్లో ఉన్న రిలయన్స్ ఇపుడు గ్రీన్‌లోకి రావడంత నిఫ్టి 107 పాయింట్ల లాభంతో 17292 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 37 షేర్లు లాభాల్లో ఉన్నా.. అన్నీ నామమాత్రంగానే ఉన్నాయి. బ్యాంక్‌ నిఫ్టి ఏమాత్రం డీలా పడ్డా నిఫ్టి బలహీనపడే అవకాశముంది. డాలర్ కాస్త తగ్గినట్లే కన్పించినా… దీనికి స్పందనగా క్రూడ్‌ పెరుగుతోంది. టెక్నికల్‌గా నిఫ్టి ప్రస్తుతం స్థాయిని దాటి ముందుకు వెళ్ళాటే 17380ని దాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి యూరో మార్కెట్‌ను పరిశీలిస్తోంది. వస్తున్న కార్పొరేట్‌ ఫలితాలు కూడా మార్కెట్‌ను పెద్ద ప్రభావితం చేయడం లేదు. అమెరికా మార్కెట్లపై ఆశతో ఎదురు చూస్తారా? లేదా యూరో మార్కెట్లను చూసి లాభాలు స్వీకరిస్తారా అన్నది చూడాలి.