For Money

Business News

నిఫ్టికి లాభాలు… షేర్లకు నష్టాలు

మార్కెట్‌ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. ఉదయం ప్రారంభంలో స్వల్ప ఒత్తిడిని ఎదుర్కొన్న నిఫ్టి… తరవాత వెనక్కి తిరిగి చూడలేదు. ఉదయం 16,606ని తాకిన నిఫ్టి ఏకంగా 16887 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 241 పాయింట్ల లాభంతో 16871 పాయింట్ల వద్ద ముగిసింది. (తాత్కాలిక ముగింపు) కేవలం బ్యాంక్‌ నిఫ్టి, ఐటీ షేర్ల కారణంగానే నిఫ్టి దాదాపు ఒకటన్నిర శాతం లాభంతో ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పుణ్యమా అని ఇవాళ నిఫ్టి బ్యాంక్‌ రెండు శాతంపైగా లాభపడింది.అలాగే నిఫ్టి ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కూడా 2 శాతంపైగా లాభంతో ముగిసింది. నిఫ్టి తరవాత అత్యంత కీలక సూచి అయిన నిఫ్టి నెక్ట్స్‌ 0.37 శాతం నష్టంతో ముగిసింది. జుబ్లియంట్‌ ఫుడ్స్‌ కౌంటర్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడి నిఫ్టి నెక్ట్స్‌ను దెబ్బతీసింది. అలాగే నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో కూడా ఎలాంటి ఉత్సాహం లేదు. కేవలం 0.19 శాతం నామ మాత్రపు లాభంతో ఈ సూచీ ముగిసింది. ఏయూ బ్యాంక్‌ భారీగా నష్టపోగా, జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఆ మేరకు పెరిగింది. వెరిశి మార్కెట్‌ భారీ లాభాల్లో ముగిసినట్లు కన్పిస్తున్నా… అది చాలా వరకు సూచీ ప్రధాన షేర్లకు మిగిలిన షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. యూరో మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లో ఉండటం నిఫ్టికి కలిసి వచ్చింది.