For Money

Business News

స్థిరంగా ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లను మన మార్కెట్లు పట్టించుకోలేదు. వీక్లీ డెరివేటివ్స్‌ కారణంగా నిఫ్టి స్వల్ప నష్టంతో ముగిసింది. మిడ్‌ సెషన్‌కు ముందుకు 18106ని తాకినా… క్లోజింగ్‌లో 18052 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 30 పాయింట్లు నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో వాల్‌స్ట్రీట్ మూడు శాతం దాకా పడినా.. మన మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. అయితే నాస్‌డాక్‌ నష్టాల దృష్ట్యా మన మార్కెట్‌లోనూ టెక్‌ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. టెక్‌ మహీంద్రా ఇవాళ మూడు శాతం దాకా నష్టపోయింది. కొన్ని షేర్లు ముఖ్యంగా బ్యాంకుల నుంచి అండ లభించడంతో నిఫ్టి నష్టాలు చాలా వరకు తగ్గాయి. యూరప్‌ మార్కెట్లు అర శాతం నుంచి ఒక శాతం వరకు నష్టంతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లోకి జారుకుంది. ఈ నేపథ్యంలో రేపు మన మార్కెట్ల కదలికలపై ఆసక్తి నెలకొంది. చాలా రోజుల తరవాత బయోకాన్‌ నాలుగు శాతం లాభపడింది. ఓల్టాస్‌ 5 శాతం పైగా క్షీణించింది.