For Money

Business News

అంచనాలను మించిన ఫలితాలు

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ అంచనాలకు మించిన ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ. 4,454.24 కోట్లకు చేరింది. ఈటీ నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్నవారు సంస్థ నికర లాభం రూ. 4177 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నికర లాభం 17.8 శాతం పెరిగింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 21.4 శాతం పెరిగింది. అలాగే సంస్థ మొత్తం ఆదాయం 23 శాతం పెరిగి రూ. 15,027కోట్లకు చేరింది. సంస్థ నికర వడ్డీ ఆదాయం కూడా 13 శాతం పెరిగి రూ. 4639 కోట్లకు చేరింది. సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తుల మొత్తం రూ. 6.9 లక్షల కోట్లకు చేరినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. ఇందులో వ్యక్తిగత రుణాల వాటా 81 శాతమని పేర్కొంది. మొత్తం రుణ మొత్తం 16 శాతం పెరగ్గా, వ్యక్తిగత రుణ మొత్తం 20 శాతం పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది.