For Money

Business News

భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

ప్రపంచ మార్కెట్లన్నీ ద్రవ్యోల్బణం దెబ్బకు కంగారు పడుతున్నాయి. డాలర్‌ 16నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. డాలర్‌ ఇండెక్స్‌ 95ను దాటడంతో అమ్మకాలు భారీగా సాగాయి. ఆరంభం నుంచే మార్కెట్‌ బలహీనంగా ఉంది. అయితే మిడ్‌ సెషన్‌లో కాస్త కోలుకున్నట్లే కన్పించినా… యూరో మార్కెట్లు నష్టాల్లోకి జారుకోవడంతో నిఫ్టి నష్టాలు మరింత పెరిగాయి. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 17,971కి చేరిన నిఫ్టి…17,798 పాయింట్ల పడింది.క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 220 పాయింట్లు క్షీణించింది. చివర్లో కాస్త కోలుకుని 17,873 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 143 పాయింట్లు నష్టపోయింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి భారీగా క్షీణించింది. ఎపుడూ ఇలాంటి ఆటోపోట్ల సమయంలో గ్రీన్‌లో ఉండే మిడ్‌ క్యాప్‌ సూచీ కూడా 0.95 శాతం క్షీణించింది. ఇవాళ రియల్ ఎస్టేట్‌ షేర్లలో ఒత్తిడి వచ్చింది. డీఎల్‌ఎఫ్‌ 4.5 శాతం క్షీణించగా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 3 శాతం దాకా పడింది.