For Money

Business News

డే ట్రేడర్లకు కనవర్షం కురిపించిన నిఫ్టి

క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 185 పాయింట్లు క్షీణించింది. కాని డే ట్రేడర్స్‌ ఇవాళ ఉదయం నుంచి పండుగ చేసుకున్నారు. ఆల్గో ట్రేడింగ్‌ లెవల్స్‌ ప్రకారం నిఫ్టి పలు మార్లు హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో 200 పాయింట్లు క్షీణించి.. అక్కడి నుంచి 250 పాయింట్లకుపైగా పెరిగింది. మిడ్‌సెషన్‌ తరవాత గరిష్ఠ స్థాయి నుంచి ఏకంగా 300 పాయింట్లు పతనమైంది. స్క్వేర్‌ ఆఫ్‌ సమయానికి మరో 150 పాయింట్లు పెరిగింది. క్లోజింగ్‌లో మరో వంద పాయింట్లు. ఇలా దాదాపు 1000 పాయింట్లు కదలాడింది. ఆల్గో లెవల్స్‌ను నిఫ్టి పూర్తిగా పాటించింది. ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు అంచాన వేసినట్లు 17,600 నుంచి 17,900 మధ్య నిఫ్టి పలుమార్లు కదలడం డే ట్రేడర్లకు బాగా కలిసి వచ్చింది. ఇక నిఫ్టి క్రితం ముగింపుతో పోలిస్తే 185 పాయింట్లు క్షీణించి 17,671 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి, ఫైనాన్షియల్ నిఫ్టి కూడా ఒక శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఉదయం భారీగా నష్టపోయిన మిడ్‌ క్యాప్‌ నిఫ్టి వెంటనే కోలుకుని… రోజంతా గ్రీన్‌లో ఉండి స్థిరంగా ముగిసింది.