For Money

Business News

నిఫ్టికి చివర్లో గట్టి మద్దతు

ఉదయం దిగువ స్థాయిలో కొనుగోలు చేసినవారికి కూడా వంద పాయింట్ల దాకా లాభం వచ్చింది. ఇవాళ మార్కెట్‌లో సెక్యూలర్‌ ర్యాలీ వచ్చిందనాలి. దాదాపు అన్ని రంగాల షేర్లు వెలుగులో ఉన్నాయి. ఆరంభంలో కాస్త ఒడుదుడుకులకు లోనైనా నిఫ్టి రోజంతా గ్రీన్‌లోనే కొనసాగింది. మిడ్‌ సెషన్‌లో 18,200ని దాటినా తరవాత కాస్త తగ్గింది. యూరో మార్కెట్లు గ్రీన్‌లో ఉండటంతో క్లోజింగ్‌కు ముందు ఊపందుకుంది. 18,128 పాయింట్ల కనిష్ఠ స్థాయి తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 18,227 గరిష్ఠ స్థాయిని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 156 పాయింట్ల లాభంతో 18,212 పాయింట్ల వద్ద ముగిసింది. ఇవాళ ప్రధాన సూచీలలో మిడ్‌ క్యాప్‌ సూచీ ఏకంగా 1.2 శాతం లాభంతో క్లోజైంది. ఐడియా మిడ్‌ క్యాప్‌లో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. భారతీ ఎయిర్‌టెల్‌ కూడా ఇవాళ 3.65 శాతం లాభంతో ముగిసింది. టీసీఎస్‌ 1.5 శాతం నష్టంతో ముగియడం విశేషం. అలాగే టైటాన్‌ కూడా. రోజూ అదానీ గ్రూప్‌ షేర్లు వెలుగులో ఉంటున్నాయి. ఇవాళ అదానీ ట్రాన్స్‌, అదానీ గ్రీన్‌ నిఫ్టి నెక్ట్స్‌లో టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి.