For Money

Business News

భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి

దిగువ స్థాయిలో మద్దతుతో పాటు వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా చివర్లో భారీగా షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. దీంతో నిఫ్టి భారీ లాభాలతో ముగిసింది. ఉదయం ఒక దశలో 17,905 పాయింట్లకు పడిన నిఫ్టి అక్కడి నుంచి కోలుకుని 18,123 పాయింట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే 229 పాయింట్ల లాభంతో నిఫ్టి 18,012 పాయింట్ల వద్ద ముగిసింది. మెటల్‌, ఐటీ షేర్లకు గట్టి మద్దతు లభించింది. మిడ్‌ సెషన్‌ తరవాత కూడా యూరో మార్కెట్లలో పెద్ద మార్పు లేదు. స్వల్ప లాభనష్టాలతో సూచీలు ట్రేడవుతున్నాయి. కేవలం షార్ట్‌ కవరింగ్‌ కారణంగానే నిఫ్టి పెరిగింది. అందుకే మిడ్‌ క్యాప్‌ షేర్లు సూచీ 0.49 శాతం లాభంతో క్లోజ్‌ కాగా, బ్యాంక్‌ నిఫ్టి కూడా అదే స్థాయి లాభాలతో ముగిసింది. నిఫ్టి టెక్‌ మహీంద్రా, హిందాల్కో టాప్‌ గెయినర్స్‌ కాగా, బజాజ్‌ ఆటో టాప్‌ లూజర్‌గా నిలిచింది.